ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద అంబటి రాంబాబు ప్రతిజ్ఞ

  • కేసుల నిమిత్తం కడప జిల్లాకు వచ్చిన అంబటి
  • జగన్ ను మళ్లీ సీఎం చేసేంత వరకు విశ్రమించబోమని ప్రతిజ్ఞ 
  • ఎన్ని కేసులు, దాడులు ఎదురైనా తగ్గేదే లేదని వ్యాఖ్య

ఇడుపులపాయ వేదికగా ఏపీ రాజకీయం మరోసారి వేడెక్కింది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తనపై నమోదైన కేసుల విచారణ నిమిత్తం కడప జిల్లాకు వచ్చారు. తొలుత గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న అంబటి, అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. 


ఈ సందర్భంగా ఆయన చేసిన 'ప్రతిజ్ఞ' పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే కూలదోస్తామని, వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకు విశ్రమించబోమని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఎన్ని కేసులు, దాడులు ఎదురైనా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.


ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల విషయంలో తాను ఇప్పటికే వివరణ ఇచ్చి, క్షమాపణలు చెప్పినప్పటికీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా అంబటి ఆరోపించారు. తన ఇల్లు, కార్యాలయంపై దాడులు చేసిన వారిని వదిలేసి, బాధితుడైన తనపైనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. ఈ పరిణామాలన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని దుయ్యబట్టారు.


Ambati Rambabu
YSRCP
Jagan
YSR Ghat
Chandrababu
TDP

More Telugu News